విద్యుత్ వైర్ల చోరీ
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:12 AM
యాచారం పోలీ్‌సస్టేషన్ పరిధిలోని నందివనపర్తిలో రెండు వ్యవసాయ బోరు మోటార్లకున్న వైర్లు చోరీకి గురయ్యాయి. గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, నారాయణరెడ్డిలు పొలం వద్ద బోరు మోటార్ల ఏర్పాటు చేశారు.

యాచారం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): యాచారం పోలీ్‌సస్టేషన్ పరిధిలోని నందివనపర్తిలో రెండు వ్యవసాయ బోరు మోటార్లకున్న వైర్లు చోరీకి గురయ్యాయి. గ్రామానికి చెందిన ముత్యంరెడ్డి, నారాయణరెడ్డిలు పొలం వద్ద బోరు మోటార్ల ఏర్పాటు చేశారు. ఈక్రమంలో విద్యుత్ వైర్లను గురువారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు అపహరించారు. దాంతో బాధిత రైతులు ఆందోళన చెందారు. కాగా, రాత్రివేళ దొంగల భయంతో పొలానికి వెళ్లాలంటేనే భయమే స్తోందని చెబుతున్నారు.