పోలీస్ కాలనీలో చోరీ
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:52 PM
మునిసిపల్ పరిధిలోని పోలీస్ కాలనీలో గురువారం రాత్రి చోరీ జరిగింది.

వికారాబాద్, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ పరిధిలోని పోలీస్ కాలనీలో గురువారం రాత్రి చోరీ జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కాలనీలో నివాసముంటున్న శివలింగం ఇంటికి తాళంవేసి వేరే గ్రామానికి వెళ్లాడు. ఇదే అదనుగా దుండగులు ఇంట్లో చొరబడి రెండు తులాల బంగారం ఎత్తుకెళ్లారు. ఈమధ్య కాలంలో వికారాబాద్ పట్టణంలో దుండగులు తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తున్నారు. ఇటీవల మదన్‌పల్లి సంగమేశ్వర ఆలయంలో సైతం చోరీ జరిగినట్లుగా గ్రామస్తులు తెలిపారు.