వృద్ధుడు అదృశ్యం
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:00 AM
మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కందాడ కృష్ణయ్య(62) అదృశ్యమైనట్లు సీఐ నరహరి సోమవారం తెలిపారు.

కేశంపేట, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందిన కందాడ కృష్ణయ్య(62) అదృశ్యమైనట్లు సీఐ నరహరి సోమవారం తెలిపారు. ఈనెల 1న కృష్ణయ్య ఇంటి నుంచి బయటకు వెళ్లి ఇంటికి తిరిగిరాలేదు. బంధువుల ఇళ్లలో, తెలిసిన వారి వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆచూకీ తెలిస్తే సీఐ- 9440904759, ఎస్సై-8712568396 నెంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.