అదృశ్యమైన వృద్ధుడు మృతి
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:37 PM
మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో వారం క్రితం అదృశ్యమైన వృద్ధుడు కందాడ కృష్ణయ్య(62) బావిలో పడి మృతిచెందినట్లు సీఐ నరహరి తెలిపారు.

కేశంపేట, జనవరి 7(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో వారం క్రితం అదృశ్యమైన వృద్ధుడు కందాడ కృష్ణయ్య(62) బావిలో పడి మృతిచెందినట్లు సీఐ నరహరి తెలిపారు. మంగళవారం గ్రామ సమీపంలోని పాడుబడిన బావిలో శవం తేలి ఉండటాన్ని గ్రామస్తులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెళ్లి శవాన్ని బయటకు తీయగా.. కృష్ణయ్యగా గ్రామస్తులు, కుటుంబ సభ్యులు గుర్తించారు. వృద్ధుడు జనవరి 1న ఇంటి నుంచి వెళ్లాడని మృతుడి కుమారుడి ఫి ర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎస్సై రాజ్‌కుమార్ మృతదేహాన్ని షాద్‌నగర్ ప్రభు త్వాసుపత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.