చెరువులో దూకిన వ్యక్తి!
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:47 PM
ఇబ్రహీంపట్నం చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయి.
గాలింపు చేపట్టిన ఎన్డీఆర్‌ఎఫ్, పోలీసులు
ఇబ్రహీంపట్నం, జనవరి 19(ఆంధ్రజ్యోతి): ఇబ్రహీంపట్నం చెరువులో ఓ వ్యక్తి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానాలు తలెత్తడంతో పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు సోమవారం గాలింపు చర్యలు చేపట్టాయి. ఇక్కడ చెరువు పెద్దతూము వద్ద సోమవారం ఉదయం ఓ మోటార్ సైకిల్, హెల్మెట్, పర్సును చూసిన బాటసారులు పోలీసులకు సమాచారమిచ్చారు. అయితే, పర్సులో మహేష్(30) పేరుతో ఆధార్ కార్డు లభించింది. హయత్‌నగర్ పరిధి మునగనూరు అడ్రస్ ఉంది. బైక్‌కూడా అతని పేరునే ఉంది. కాగా, మహేష్ అనే వ్యక్తి ఆదివారం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. ఇక్కడ చెరువు వద్ద దొరికిన బైక్, పర్సు మ హేష్‌విగా గుర్తించడంతో అతనే చెరువులో దూకి ఉంటాడా అనే అను మానాలు తలెత్తడంతో రాత్రివరకు గాలించినా ఆచూకీ దొరకలేదు.