Share News

చెరువులోకి దూసుకెళ్లిన కారు

ABN , Publish Date - Jan 16 , 2025 | 12:19 AM

మండల పరిధిలోని ఇప్పలపల్లి చెరువు కట్టపై నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.

చెరువులోకి దూసుకెళ్లిన కారు

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

కేశంపేట, జనవరి 15(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని ఇప్పలపల్లి చెరువు కట్టపై నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. వివరాల్లోకి వెళితే.. షాద్‌నగర్‌ ప్రాంతానికి చెందిన మల్లేశ్వర్‌రావు మంగళవారం వేముల్‌నర్వలోని తన పౌలీ్ట్రఫాంలో విధులు ముగించుకొని షాద్‌నగర్‌ వైపు కారులో వెళ్తున్నాడు. ఇప్పలపల్లి చెరువు కట్టపై అదుపుతప్పిన కారు వేగంగా చెరువులోకి దూసుకెళ్లింది. అయితే, అది విద్యుత్‌ స్తంభాలను ఢీకొట్టడంతో ప్రమాద తీవ్రత తగ్గింది. కాగా, మల్లేశ్వర్‌రావు కారులో నుంచి బయటకు దూకాడు. అనంతరం కారును చెరువులో నుంచి బయటకు తీసి షెడ్‌కు తరలించారు.

Updated Date - Jan 16 , 2025 | 12:19 AM