మెరుగైన వసతుల కల్పనే ధ్యేయం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:34 PM
ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అధికారులు నిబద్దదతో పనిచేసి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు.

ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి
ఆమనగల్లు, జనవరి 17(ఆంధ్రజ్యోతి): ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అధికారులు నిబద్దదతో పనిచేసి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు. ఆమనగల్లు, కడ్తాల్, కల్వకుర్తి మండలాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. రూ.4.80 కోట్లతో చేపట్టే పనులకు శంకుస్థాపన చేశారు. ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పలువురు లబ్దిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం, అన్ని వర్గాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సహకారం, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలతో కల్వకుర్తి ప్రాంతానికి మహర్దశ ఏర్పడిందని నారాయణ రెడ్డి అన్నారు. అర్హులైన నిరుపేదలందరికీ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, ప్రభుత్వ పథకాలు అందిస్తుందని చెప్పారు. సాగుకు యోగ్యమైన భూములన్నింటికీ ఈనెల 26 నుంచి రైతు భరోసా కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు చెప్పారు. రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి సభ్యుడు బాలాజీసింగ్, మున్సిపల్ చైర్మన్ సత్యం, మార్కెట్ చైర్‌పర్సన్లు గీతనర్సింహ, మనీలాసంజీవ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు విజయ్‌కుమార్‌రెడ్డి, నర్సింహ, పీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్, కాంగ్రెస్ మండలాధ్యక్షులు శ్రీకాంత్‌రెడ్డి, మోతిలాల్, జగన్, బీచ్యనాయక్, ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకుడు కాసు శ్రీనివాస్ రెడ్డి, డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, మార్కెట్ వైస్‌చైర్మన్ భాస్కర్‌రెడ్డి, హన్యనాయక్, డాక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.