విద్యానగర్ కాలనీ అభివృద్ధికి తోడ్పాటు
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:35 AM
మున్సిపాలిటీలోని విద్యానగర్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తోడ్పాటునందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గానికి మహర్దశ ఏర్పడిందని తెలిపారు. విద్యానగర్ కాలనీ వాసులు ఆదివారం ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు.

ఆమనగల్లు, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మున్సిపాలిటీలోని విద్యానగర్ కాలనీ అభివృద్ధికి ప్రభుత్వపరంగా తోడ్పాటునందిస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సహకారంతో కల్వకుర్తి నియోజకవర్గానికి మహర్దశ ఏర్పడిందని తెలిపారు. విద్యానగర్ కాలనీ వాసులు ఆదివారం ఎమ్మెల్యేను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పూలమాలలు, శాలువాలతో సత్కరించారు. అనంతరం కాలనీలో నెలకొన్న సమస్యలపై ఎమ్మెల్యే వినతి పత్ర అందజేశారు. కసిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా పాలనలో అన్ని గ్రామాలు, తండాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తామని తెలిపారు. టీపీసీసీ సభ్యుడు శ్రీనివా్‌సగౌడ్, కాలనీవాసులు జంగయ్య, అల్లాజీగౌడ్, గుజ్జరి నర్సింహ, రమేశ్, తదతరులున్నారు.
షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలి
ఆమనగల్లు మున్సిపాలిటీలోని మండల పరిషత్ కార్యాలయం ఎదుట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించాలని ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డిని చిరువ్యాపారుల సంఘం నాయకులు కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్యే నారాయణరెడ్డిని నాయకులు ఆయన నివాసంలో మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ గుర్రం కేశవులుతో కలిసి వినతిపత్రం అందజేశారు.