Share News

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:54 PM

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టెక్‌ మహింద్రా మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రావు తెలిపారు.

విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోవాలి

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకోని నైపుణ్యాలను పెంపొందించుకోవాలని టెక్‌ మహింద్రా మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రావు తెలిపారు. పోచారం మున్సిపాలిటీ, వెంకటాపూర్‌ అనురాగ్‌ యూనివర్సిటీలో శుక్రవారం స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఆధ్వర్యంలో జరిగిన ’ఎసెన్షియల్స్‌ అఫ్‌ కెరియర్‌ షెపింగ్‌‘ సదస్సులో ఆయన ముఖ్యఅథితిగా పాల్గొని మాట్లాడారు. మేనేజ్‌మెంట్‌ విద్యార్థులు కమ్యునికేషన్‌ స్కిల్స్‌ను పెంపొందించుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీడీఎల్‌ మాజీ జీఎం సంపత్‌కుమార్‌, డీన్లు విష్ణుచందన, శ్రీనివా్‌సరావు, అధ్యాపకులు, కో-ఆర్టినేటర్లు లక్ష్మి, పావని, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 07 , 2025 | 11:55 PM