మంగల్‌పల్లి అటవీ ప్రాంతంలో అస్థిపంజరం లభ్యం
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:21 AM
మండల పరిధిలోని మంగల్‌పల్లి అటవీ ప్రాంతంలో అస్థిపంజరం లభ్యమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు..
ఎంపీ పటేల్‌గూడకు చెందిన లక్ష్మయ్యగా గుర్తింపు
ఆదిభట్ల, జనవరి 8 (ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని మంగల్‌పల్లి అటవీ ప్రాంతంలో అస్థిపంజరం లభ్యమైన ఘటన బుధవారం చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్‌రెడ్డి కథనం మేరకు.. అది ఆదిభట్ల మున్సిపాలిటీ ఎంపీ పటేల్‌గూడకు చెందిన యంజాల లక్ష్మయ్య(70) దిగా గుర్తించారు. 3 నెలల క్రితం లక్ష్మయ్య మతిస్థిమితం కోల్పోయి ఇంటి నుంచి బయలకు వెళ్లినట్లు కుటుంబ సభ్యులు గతేడాది సెప్టెంబరులో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. ఈక్రమంలో అతడి అస్థిపంజరం మంగల్‌పల్లి అటవీ ప్రాంతంలో లభ్యమైంది. అటవీ ప్రాంతంలోకి గొర్రెలను మేతకు తీసుకెళ్లిన ఓ కాపరి అస్థిపంజరాన్ని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ రాఘవేందర్‌రెడ్డి ఎస్సై బాల్‌రాజు, క్లూస్ టీంతో ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అస్థిపంజంరంపై ఉన్న చొక్క, చేతికి ఉన్న తిరుమల వేంకటేశ్వరుడి దారం ఆధారంగా లక్ష్మయ్యగా గుర్తించి శవపరీక్ష నిమిత్తం ఉస్మానియాకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.