Share News

వైభవంగా సీతారాముల కల్యాణం

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:03 AM

మండల పరిధిలోని తీగాపూర్‌ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మండల పూజలో భాగంగా సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయం 41 రోజులు పూర్తి చేసుకోవడంతో గ్రామ ప్రజలు మండల పూజ నిర్వహించారు. ప్రతిష్ఠ వైదిక పురోహితులు, ఛండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజుశర్మ ఆధ్వర్యంలో పురోహితులు సీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు.

వైభవంగా సీతారాముల కల్యాణం
కల్యాణంలో నాయకులు

కొత్తూర్‌, జనవరి 21(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని తీగాపూర్‌ గ్రామంలో గల శ్రీ సీతారామచంద్ర పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం మండల పూజలో భాగంగా సీతారాముల కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. నూతనంగా నిర్మించిన ఆలయం 41 రోజులు పూర్తి చేసుకోవడంతో గ్రామ ప్రజలు మండల పూజ నిర్వహించారు. ప్రతిష్ఠ వైదిక పురోహితులు, ఛండీ ఉపాసకులు బ్రహ్మశ్రీ రేవల్లి రాజుశర్మ ఆధ్వర్యంలో పురోహితులు సీతారామచంద్ర స్వామి కల్యాణాన్ని వైభవంగా జరిపించారు. పలువురు దంపతులు కల్యాణంలో పాల్గొన్నారు. తెల్లవారుజాము నుంచే గణపతిపూజ, మూలమంత్ర హోమాలు, పూర్ణకుంభాబిషేకాలు, మహాస్నపనం, తదితర పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామానికి చెందిన వేలాది మంది పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో షాద్‌నగర్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ చైర్మన్‌ బి. జగన్‌మోహన్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ చిర్ర మల్లయ్య, మాజీ ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి, మాజీ సర్పంచులు జయప్రద జగన్‌మోహన్‌రెడ్డి, రమాదేవిరమేష్‌, మెండె నర్సింహ, అంబటి ప్రభాకర్‌, కాంగ్రెస్‌ పార్టీ మండల శాఖ అధ్యక్షుడు గొంగళ్ల హరినాథ్‌రెడ్డి, కొత్తూర్‌ మున్సిపల్‌ అధ్యక్షుడు జె.సుదర్శన్‌గౌడ్‌, బీఆర్‌ఎస్‌ మండల శాఖ అధ్యక్షుడు కృష్ణయాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు ఎల్లారం శేఖర్‌రెడ్డి, రవినాయక్‌, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 22 , 2025 | 12:03 AM