అర్హులందరికీ పథకాలు వర్తింపజేయాలి
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:20 AM
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి వర్తింజేసేలా ఉద్యోగులు, అధికారులు చొరవ తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి అన్నారు.

యాచారం/షాబాద్/చౌదరిగూడ/ఆమనగల్లు/మొయినాబాద్/కేశంపేట/కడ్తాల్/ఆమనగల్లు, జనవరి 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతీ పేద కుటుంబానికి వర్తింజేసేలా ఉద్యోగులు, అధికారులు చొరవ తీసుకోవాలని మండల ప్రత్యేకాధికారి సంధ్యారాణి అన్నారు. బుధవారం యాచారం మండల పరిషత్‌కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, రేషన్‌కార్డుల జారీ ప్రక్రియలపై ఆయా శాఖల అధికారులతో అవగాహన సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ టి.అయ్యప్ప, వ్యవసాయాధికారి సందీ్‌పకుమార్, ఏపీవో లింగయ్య, ఆర్‌ఐలు మురళి, రామకృష్ణ తదితరులున్నారు. పథకాలకు సంబంధించి వెరిఫికేషన్ ప్రక్రియను అధికారులు పకడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో అపర్ణ అన్నారు. బుధవారం షాబాద్ మండల పరిషత్ కార్యాలయం సమావేశ మందిరంలో మండల స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఏవో వెంకటేశం, డీటీ మధు, ప్రత్యేకాధికారులు పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇళ్లు, రైతుభరోసా, ఇందిరమ్మ ఆత్మీయభరోసా, నూతన రేషన్ కార్డుల జారీ కోసం గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారుల వివరాలను పక్కాగా చేపట్టాలని జిల్లేడ్ చౌదరిగూడ ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్ సూచించారు. బుధవారం కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండల పరిషత్ కార్యాలయాల్లో ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బంది, ఐకేపీ, రెవెన్యూ, వ్యవసాయశాఖ అధికారులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను 16 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో ఫీల్డ్ సర్వేచేసి లబ్ధిదారుల ఎంపిక చేపట్టాలని అధికారులకు సూచించారు. తహసీల్ధార్‌లు జగదీశ్వర్, రమే్‌షకుమార్, ఎంపీడీవో లక్ష్మీఅనురాధ, వ్యవసాయాధికారులు రాజేందర్‌రెడ్డి, సురే్‌షరెడ్డి, ఎంపీవోలు హన్మంత్‌రెడ్డి, లాలయ్యలతో పాటు కార్యదర్శులు పాల్గొన్నారు. రైతు భరోసా పథకంలో భాగంగా సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వ ఆదేశానుసారం ఆమనగల్లు మండలంలో గురువారం నుంచి సాగు భూములను గుర్తించేందుకు సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్ లలిత తెలిపారు. రైతుభరోసా పథకంలో భాగంగా రోడ్లు, గుట్టలు, సాగుకు పనికిరాని భూములు, లే అవుట్లను గుర్తించేందుకు సర్వే చేపడుతున్నట్లు వివరించారు. సర్వేలో భాగంగా రాంనుంతల గ్రామంలో రెవెన్యు, వ్యవసాయ శాఖల ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు లలిత చెప్పారు. ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న పథకాల అమలుపై రెవెన్యూ, వ్యవసాయ, పంచాయత్‌రాజ్ అధికారులు, గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారులు, బుధవారం మొయినాబాద్ మండల పరిషత్‌కార్యాలయంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అర్హులందరికీ పథకాలు అందజేయాలని కేశంపేట ఎంపీడీవో రవిచంద్రకుమార్ రెడ్డి తెలిపారు. మండల పరిషత్ సమావేశ మందిరంలో పథకాల అమలుపై క్షేత్ర పరిశీలనపై గ్రామ స్థాయి అధికారులు ఏఈవో, వీఆర్‌ఏ, ఫీల్డ్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈనెల 16నుంచి 20 వరకు దరఖాస్తులను క్షేత్ర పరిశీలన చేయాలని సూచించారు. అలాగే 21, 22, 23 తేదీల్లో గ్రామ సభలు నిర్వహించి అర్హుల జాబితాను ప్రకటించాలని సూచించారు. తహసీల్దార్ మీర్ అజం అలీఖాన్, ఎంపీవో కిష్టయ్య, ఏవో శిరీష తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా అమలు చేస్తున్న రైతుభరోసా, ఇందిరమ్మఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులకు లబ్దిదాల ఎంపిక ప్రభుత్వ నిబంధనలనకు లోబడి పారదర్శకంగా చేపట్టాలని మండల ప్రత్యేక అధికారి, డీటీడీవో రామేశ్వరి దేవి, ఎంపీడీవో సుజాత, తహసీల్దార్ ముంతాజ్‌లు కోరారు. కడ్తాల రైతు వేదికలో పథకాలపై కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులకు అవగాన సమావేశం నిర్వహించారు. లబ్ధిదారుల జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులను గుర్తించాలని ఆమనగల్లు మున్సిపల్ కమిషనర్ వసంత కోరారు. ఆమనగల్లు మున్సిపాలిటీ కార్యాలయంలో ఇందిరమ్మ ఇళ్ల, రేషన్‌కార్డుల లబ్దిదారుల జాబితా వెరిఫికేషన్‌పై సర్వేకు నియమించిన వార్డు ఆపీసర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. చైర్మన్ రాంపాల్ నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, కౌన్సిలర్లు విక్రమ్‌రెడ్డి, కృష్ణ యాదవ్, చెన్నకేశవులు, లక్ష్మణ్, కో-ఆప్షన్ సభ్యుడు పాష, సిబ్బంది సత్యనారాయణ, దామోదర్, ఉపేందర్‌రెడ్డి, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.