సావిత్రిబాయి జీవితం అందరికీ ఆదర్శం
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:17 AM
సావిత్రిబాయి పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు.

ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, యాదయ్య
పూలే జయంతి సందర్భంగా నివాళి
కాలేజీలు, స్కూళ్లలో మహిళా ఉపాధ్యాయులకు ఘన సన్మానం
షాద్‌నగర్‌అర్బన్/షాద్‌నగర్‌రూరల్/కొత్తూర్ /కేశంపేట/నందిగామ/చౌదరిగూడ/చేవెళ్ల/షా బాద్/శంషాబాద్ రూరల్/కడ్తాల్/తలకొండపల్లి /ఇబ్రహీంపట్నం/ఆమనగల్లు/ఆదిభట్ల /కందుకూరు, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): సావిత్రిబాయి పూలే ఆశయాలకు అనుగుణంగా ప్రతీ ఒక్కరు నడుచుకోవాలని ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ పిలుపునిచ్చారు. ఆమె జయంతిని పురష్కరించుకొని శుక్రవారం షాద్‌నగర్‌లోని సావిత్రిబాయి విగ్రహానికి కాంగ్రెస్ నాయకులతో కలిసి నివాళులర్పించారు. ఏఎంసీ చైర్మన్ సులోచనా కృష్ణారెడ్డి, వైస్‌చైర్మన్ బాబర్‌ఖాన్ తదితరులున్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సర్వేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో మహిళా అధ్యాపకులను సన్మానించారు. షాద్‌నగర్ విజ్ఞాన్ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ భవానీ శంకర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించి, అధ్యాపకులను సన్మానించారు. 3వవార్డులోని ప్రభుత్వ పాఠశాలలో బీఆర్‌ఎస్ నాయకుడు అశోక్‌యాదవ్ పూలేకు నివాళులర్పించి, టీచర్లను సన్మానించారు. నాగర్‌కర్నూల్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల ప్రిన్సిపాల్ శైలజ ఆధ్వర్యంలో షాద్‌నగర్ పట్టణం సోలీపూర్ శివారులోని కళాశాలలో టీచర్లను సన్మానించారు. కొత్తూరు మున్సిపాలిటీతో పాటు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లను సన్మానించారు. ఎంఈవో అంగోర్‌నాయక్, హెచ్‌ఎంలు, కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులున్నారు. కేశంపేట తహసీల్దార్ అజాంఅలీ ఖాన్ మండల కేంద్రంలో సావిత్రిబాయి చిత్ర పటానినికి అధికారులతో కలిసి నివాళులర్పించారు. కాంగ్రెస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా నివాళులర్పించారు. ఎంపీవో కిష్టయ్య, కాంగ్రెస్, బీజేపీ నాయకులు తదితరులున్నారు. నందిగామ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో మహిళా టీచర్లను కాంగ్రెస్ నాయకులు సన్మానించారు. పార్టీ మండలాధ్యక్షుడు జంగ నర్సింలు నాయకులున్నారు. కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మహిళా టీచర్లను పద్మారం మాజీ సర్పంచ్ లక్ష్మీసుధ ఆధ్వర్యంలో సన్మానించారు. కొందుర్గు మండల కేంద్రంలోని ఎస్సీ గురుకుల పాఠశాల, జడ్పీహెచ్‌ఎ్‌స, మండల ఎమార్సీ భవనంలో ఎంఈవో గాయిత్రీదేవి ఆధ్యక్షతన టీచర్లను సన్మానించారు. ఏఎంసీ చైర్మన్ సులోచనా కృష్ణారెడ్డి, కొందుర్గు ఎంఈవో గాయత్రీదేవి ఉన్నారు. పూలేను ఆదర్శంగా తీసుకోవాలని ఎంఈవో లక్ష్మణ్‌నాయక్ అన్నారు. షాబాద్ మండలంలోని బాలికల ఉన్నత పాఠశాల, ఆమన్‌గల్ గురుకులం, మాంటిస్సోరి స్కూల్, ఎల్గొండగూడ ప్రాథమిక పాఠశాలల్లో సావిత్రిబాయి విగ్రహానికి నివాళులర్పించారు. బీసీసేన జాతీయ అధ్యక్షుడు బర్క కృష్ణ, ప్రధానోపాధ్యాయులు, టీచర్లు నాయకులున్నారు. సావిత్రిబాయిని ఆదర్శంగా తీసుకోవాలని చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య తెలిపారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విగ్రహానికి ఆర్డీవో చంద్రకళ, ప్రజాప్రతినిధులతో కలిసి నివాళులర్పించారు. మోడల్ కాలనీలోని బాలికల గురుకుల పాఠశాలలో ఎంఈవో పురందాస్ నివాళులర్పించారు. తహసీల్దార్ కృష్ణయ్య, ముడిమ్యాల్ పీఏసీఎస్ చైర్మన్ ప్రతా్‌పరెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ రాములు, మాజీ జెడ్పీటీసీ మాలతి, బీజేపీ యువ నాయకుడు వైభవ్‌రెడ్డి, ఏఎంసీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి, చేయూత ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు వెంకటేశ్, సభ్యులున్నారు. శంషాబాద్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టీఎ్‌సఎ్‌సవో ఆధ్వర్యంలో సావిత్రిబాయి జయంతిని నిర్వహించారు. కళాశాల సిబ్బంది, డీఎ్‌సఎ్‌సవో శంషాబాద్ కమిటీ సభ్యులు, లక్ష్మీనివాస్ పాల్గొన్నారు. సావిత్రిబాయి జీవితాన్ని, పోరాట పటిమను ఆదర్శంగా తీసుకొని మహిళలు ముందుకు సాగాలని, బీఆర్‌ఎస్ కడ్తాల్ మండలాధ్యక్షుడు పరమేశ్, మాజీ జడ్పీటీసీ దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, బీఆర్‌ఎ్‌స్ గ్రామాధ్యక్షుడు రామకృష్ణలు అన్నారు. మండల కేంద్రంలో సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. నాయకులు తదితరులున్నారు. బీసీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాఘవేందర్ ఆధ్వర్యంలో సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. విద్యార్థులకు నోట్‌పుస్తకాలు అందజేశారు. మహిళా టీచర్లను సత్కరించారు. హెచ్‌ఎం జంగయ్య, టీచర్లు, నాయకులున్నారు. ఆమనగల్లు పట్టణంలో జయంతిని కాంగ్రెస్ మండలాధ్యక్షుడు జగన్, పట్టణాధ్యక్షుడు మానయ్యల ఆధ్వర్యంలో నిర్వహించారు. సావిత్రిబాయి చిత్రపటానికి నివాళులర్పించారు. కృష్ణనాయక్, ఖాదర్, అలీం, ఖరీం, ఎంగళి ప్రసాద్, తదితరులున్నారు. బీఆర్‌ఎ్‌స్ ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతిలో పత్యనాయక్, సాయిలు, నిరంజన్, వెంకటేశ్, తదితరులున్నారు. తలకొండపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో పూలే జయంతి నిర్వహించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు సుధాకర్, పద్మ నర్సింహ, తదితరులున్నారు. ఆదిభట్ల మున్సిపాలిటీ పరిధిలోని ప్రాథమికోన్నత పాఠశాలలో పూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి హెచ్‌ఎం పరమేష్, భాషయ్య, మహిళా ఉపాధ్యాయురాలు లక్ష్మిదేవి నివాళులర్పించారు. మహిళా విద్యా వికాసం కోసం సావిత్రిబాయి పూలే కృషి మరువలేనిదని ఇబ్రహీంపట్నం మండల విద్యాఽధికారి హీర్యానాయక్ అన్నారు. పీఆర్టీయూ ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం బాలికల ఉన్నత పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మహిళా టీచర్లను సన్మానించారు. తెలంగాణ పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, హెచ్‌ఎం వెంకట్‌రెడ్డి, లావణ్య, పీఆర్టీయూ మండలాధ్యక్షుడు పరమేష్, చంద్రశేఖర్, సురేష్ ఉన్నారు. ఆశ్రిత డిగ్రీ కళాశాలలో ఐద్వా ఆధ్వర్యంలో జయంతిని నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు బి.సామ్యేల్, ప్రిన్సిపాల్ రవి తదితరులున్నారు. పాషా నరహరి కార్యాలయంలో నిర్వహించిన జయంతిలో మహిళా సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు విజయమ్మ, సుమలత, అరుణ, మున్ని తదితరులు పాల్గొన్నారు. కందుకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ మంగరాజు ఆధ్వర్యంలో పూలే జయంత్రిని అధ్యాపకులతో కలిసి ఘనంగా జరుపుకున్నారు. టీచర్లను సన్మానించారు. నేదునూరు ఉన్నత పాఠశాలలో జయంతిని ఘనంగా జరుపుకున్నారు.