Share News

రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:07 AM

రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లి వాసులు డిమాండ్‌ చేసారు. చెర్లపల్లి నుండి రాంపల్లి మీదుగా కరీంగూడ వరకు ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే.

రోడ్డు విస్తరణ పనులు పూర్తిచేయాలి
స్థానికులతో మాట్లాడుతున్న ఆర్‌అండ్‌బీ ఈఈ విఠలయ్య

కీసర రూరల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): రోడ్డు విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయాలని నాగారం మున్సిపాలిటీ రాంపల్లి వాసులు డిమాండ్‌ చేసారు. చెర్లపల్లి నుండి రాంపల్లి మీదుగా కరీంగూడ వరకు ప్రభుత్వం రోడ్డు విస్తరణ చేపట్టిన విషయం తెలిసిందే. సంబంధిత కాంట్రాక్టర్‌ పనులు చేపట్టడంలో జాప్యం చేస్తుండటంపై స్థానికులు సోమవారం ఆర్‌ అండ్‌ బీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. విస్తరణలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా తవ్వి వదిలేసిన గుంతలతో, మట్టి కుప్పలతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు స్పంధించి వెంటనే రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేయాలని డిమాండ్‌ చేసారు. కాగా ఆర్‌ అండ్‌ బీ ఈఈ విఠలయ్య రాంపల్లికి చేరుకుని స్థానికులతో సమావేశమై తగు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Jan 07 , 2025 | 12:07 AM