వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేయాలి
ABN , Publish Date - Feb 08 , 2025 | 11:30 PM
విద్యార్థులు వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేయాడానికి కృషిచేయాలని నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగు కళాశాల డైరెక్టర్ డాక్టర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు.
ఘట్‌కేసర్ రూరల్, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు వ్యవసాయ రంగంలో పరిశోధనలు చేసి వ్యవసాయాన్ని బలోపేతం చేయాడానికి కృషిచేయాలని నల్ల నర్సింహారెడ్డి ఇంజనీరింగు కళాశాల డైరెక్టర్ డాక్టర్ సీవీ కృష్ణారెడ్డి తెలిపారు. కాచవానిసింగారం నిహాక్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో శనివారం జరిగిన ‘ఎన్‌టాక్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్’ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని జ్యోతిప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దేశం ఆర్థిక వృద్ధి చెందాలంటే వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు. వ్యవసాయ రంగంలో మరిన్ని పరిశోధనలు అవసరమని గుర్తుచేశారు. క్రిమిసంహారక మందుల వాడకం తగ్గించి, సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేసినప్పుడే ఆరోగ్యవంతమైన దేశంగా భారత్ నిలుస్తుందన్నారు. నిహాక్ స్కూల్‌లో విద్యార్థులు వ్యవసాయ రంగంపై చేసిన ప్రజెంటేషన్లు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నిహాక్ స్కూల్ డైరెక్టర్ తీగుళ్ల సంపత్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.