అర్హులందరికీ రేషన్‌కార్డులు అందిస్తాం
ABN , Publish Date - Jan 18 , 2025 | 11:57 PM
అర్హులందరికీ తప్పనిసరిగా రేషన్‌కార్డులు అందిస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, మామిడిపల్లి, మొదళ్లగూడలో అధికారులు నిర్వహిస్తున్న గృహలక్ష్మి సర్వేలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

నందిగామ, జనవరి 18(ఆంధ్రజ్యోతి): అర్హులందరికీ తప్పనిసరిగా రేషన్‌కార్డులు అందిస్తామని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, మామిడిపల్లి, మొదళ్లగూడలో అధికారులు నిర్వహిస్తున్న గృహలక్ష్మి సర్వేలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మొదళ్లగూడలో సక్కుబాయి అనే మహిళ.. మీకు ఓటు వేసానని గ్రామంలో కొందరు తన ఓటును తొలగించారని ఎమ్మెల్యేకు తెలపడంతో తహసీల్ధార్‌కు ఎమ్మెల్యే అక్కడి నుండే ఫోన్‌చేసి సక్కుబాయి ఓటును పునరుద్ధరించాలని తెలిపారు. నాయకులు శివశంకర్‌గౌడ్, జంగ నర్సింలు, కొమ్ము కష్ణ, చంద్రపాల్‌రెడ్డి, తదితరులున్నారు.
మొయినాబాద్ రూరల్ : రైతు భరోసా, నూతన రేషన్‌కార్డుల జారీల విషయంలో లబ్ధిదారుల నుంచి పక్కాగా వివరాలు సేకరించాలని మొయినాబాద్ తహసీల్దార్ గౌతమ్‌కుమార్ సూచించారు. చిన్నమంగళారం, కుత్బుద్దీన్‌గూడలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులతో కలిసి భూములను పరిశీలించారు. ఆర్‌ఐలు రోజు, అజిత్‌రెడ్డి, రైతులు పాల్గొన్నారు.
కేశంపేట : వ్యవసాయేతర భూములను పక్కగా గుర్తించాలని తహసీల్దార్ మీర్ ఆజంఅలీ సూచించారు. అల్వాలలో భూముల గుర్తింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మండల వ్యవసాధికారి శిరీష, ఏఈవో వినయ్ తదితరులున్నారు. రేషన్ కార్డుల సర్వేను ఎంపీడీవో పరిశీలించారు. కొనాయపల్లి, వేముల్‌నర్వలో సర్వే తీరును పరిశీలించారు.
ఆదిభట్ల : ఇందిరమ్మ ఇళ్ల ఎంపికపై ఈనెల 21, 22న వార్డుసభలు నిర్వహించనున్నట్లు మున్సిపల్ కమిషనర్ ఎన్.బాలకృష్ణ ప్రకటనలో తెలిపారు. ప్రజా పాలనలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తుదారుల ఎంపిక ఉంటుదని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డు కొరకు దరఖాస్తు చేసుకున్న అర్జీదారులు సభలలో పాల్గొనాలని ఆయన పేర్కొన్నారు.