సమస్యలు పరిష్కరించాలి : మున్సిపల్ కార్మికులు
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:33 AM
మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు తెలిపారు. ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆదివారం కార్మిక యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుడు పెంటయ్య దీక్షను ప్రారంభించారు.

ఆమనగల్లు/శంషాబాద్/ఇబ్రహీంపట్నం, జనవరి 5(ఆంధ్రజ్యోతి): మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పరిష్కరించకపోతే నిరవధిక సమ్మె చేపడుతామని మున్సిపల్ కార్మిక యూనియన్ నాయకులు తెలిపారు. ఆమనగల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆదివారం కార్మిక యూనియన్, సీఐటీయూ ఆధ్వర్యంలో 48 గంటల నిరసన దీక్ష చేపట్టారు. సీఐటీయూ జిల్లా నాయకుడు పెంటయ్య దీక్షను ప్రారంభించారు. దీక్షలకు సీపీఎం ఏరియా కన్వీనర్ పిప్పళ్ల శివశంకర్ మద్దతు తెలిపారు. కార్మిక యూనియన్ నాయకులు హంసమ్మ, రవి, తదిరులున్నారు. శంషాబాద్ మున్సిపల్ కార్మికుల కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కార్మికులు సీఐటీయూ ఆధ్వర్యంలో రెండో రోజు అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నాచేశారు. కార్మికుల సంఘం జిల్లా నాయకుడు నగేష్, ప్రవీణ్, రవి, తదితరులున్నారు కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ వర్కర్లు, కార్మికులకు కనీస వేతనం రూ.26వేలు చెల్లిస్తూ పర్మనెంట్ చేయాలని మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కార్యదర్శి డి.కిషన్ డిమాండ్ చేశారు. ఇబ్రహీంపట్నం మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. సీఐటీయూ మున్సిపల్ కన్వీనర్ ఎల్లేష్, పి.లక్ష్మయ్య, యాదయ్య, తదితరులున్నారు.