Share News

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:24 AM

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్మే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీతో పాటు మండలంలోని చౌదరిగూడకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
పార్టీలో చేరిన వారితో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్‌

శంషాబాద్‌, జనవరి 8(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని ఎమ్మెల్మే ప్రకాశ్‌గౌడ్‌ అన్నారు. శంషాబాద్‌ మున్సిపాలిటీతో పాటు మండలంలోని చౌదరిగూడకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలు బుధవారం ఎమ్మెల్యే సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరారు. మాజీ వార్డుసభ్యురాలు జయమ్మ ఆధ్వర్యంలో పలువురు మహిళలు, యువకులు పార్టీలో చేరారు. ప్రకా్‌షగౌడ్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ రాష్ట్రంలో సమర్థవంతమైన పాలన అందిస్తుందన్నారు. ఈ విషయం గుర్తించే టీఆర్‌ఎస్‌ నుంచి మహిళలు, యువకులు కాంగ్రె్‌సలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన కార్యకర్తలందరూ పార్టీ అభ్యున్నతికి కృషిచేస్తూ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ఎక్కువ సంఖ్యలో గెలిపించాలని కోరారు. తాళ్ల జయమ్మ, ఎన్‌.శ్యామల, బేబి, మంజుల, చంద్రకళ, లావణ్య, అండాలు, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 09 , 2025 | 12:24 AM