Share News

శుద్ధ తాగుజలాలతో సంపూర్ణ ఆరోగ్యం

ABN , Publish Date - Jan 19 , 2025 | 11:50 PM

శుద్ధ తాగుజలాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తాయని టాస్క్‌ సీవోవో, ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి అన్నారు.

శుద్ధ తాగుజలాలతో సంపూర్ణ ఆరోగ్యం
నీటిశుద్ధి కేంద్రాన్ని ప్రారంభిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి

టాస్క్‌ సీవోవో సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి

ఆమనగల్లు, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): శుద్ధ తాగుజలాలు సంపూర్ణ ఆరోగ్యానికి ఉపకరిస్తాయని టాస్క్‌ సీవోవో, ఐక్యత ఫౌండేషన్‌ చైర్మన్‌ సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డి అన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కల్పన, కల్వకుర్తి నియోజకవర్గ సమగ్రాభివృద్ధి ఐక్యత ఫౌండేషన్‌ ధ్యేయమని అన్నారు. కుప్పగండ్ల గ్రామంలో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.3లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన నీటిశుద్ధి కేంద్రాన్ని ఆదివారం రాఘవేందర్‌రెడ్డి ప్రారంభించారు. గ్రామంలో తాగునీటి సమస్యలు తెలుసుకొని సొంత నిధులతో నీటిశుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయించిన సుంకిరెడ్డి రాఘవేందర్‌ రెడ్డిని స్థానికులు సత్కరించి అభినందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సమష్టి కృషితోనే అభివృద్ధి సాధ్యమన్నారు. గ్రామాల అభివృద్ధి విషయంలో రాజకీయాలకు చోటు లేకుండా ప్రజలంతా పాలు పంచుకోవాలని కోరారు. కల్వకుర్తి నియోజకవర్గంలో గ్రామీణ ప్రజలు శుద్ధ తాగుజలాలు అందించేందుకు ఐక్యత ఫౌండేషన్‌ ద్వారా నీటిశుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. టాస్క్‌ ద్వారా నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. సీనియర్‌ నాయకులు తలసాని వెంకట్‌ రెడ్డి, మొక్తాల రమేశ్‌, దామోదర్‌ రెడ్డి, చెన్నయ్య గౌడ్‌, శ్రీను, సాగర్‌, రమేశ్‌ యాదవ్‌, రమేశ్‌, ప్రభాకర్‌ సాగర్‌, శివరాజ్‌ గౌడ్‌, శ్రీధర్‌, జంగయ్య, గణేశ్‌, కృష్ణ, బాల్‌రాజ్‌, మురళియాదవ్‌, మహేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 19 , 2025 | 11:50 PM