అదుపుతప్పిన ఆటో..
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:11 AM
ఆటో అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన షాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని మంగళవారం చోటుచేసుకుంది.
ఇద్దరికి తీవ్ర గాయాలు
షాబాద్, జనవరి 21(ఆంధ్రజ్యోతి): ఆటో అదుపుతప్పడంతో ఇద్దరికి తీవ్రగాయాలు, ముగ్గురికి స్వల్పగాయాలైన ఘటన షాబాద్ పోలీ్‌సస్టేషన్ పరిధిలోని మంగళవారం చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ కాంతారెడ్డి కథనం మేరకు.. సర్దార్‌నగర్ నుంచి షాబాద్‌కు వస్తున్న ఆటోలో ఆరుగురు ప్రయాణికులు ఉన్నారు. షాబాద్ సమీపంలో ఈట్ అండ్ పే హోటల్ సమీపంలో ఆటో అదుపుతప్పి పడిపోయింది. దాంతో కుమ్మరిగూడకు చెందిన కుమ్మరి ఎల్లయ్య, కొమరబండకు చెందిన గంధం రాములుకు తీవ్రగాయాలు కాగా.. ఎల్లయ్య భార్య పద్మమ్మ, చర్లగూడకు చెందిన మల్కాపురం సాయిలమ్మ అదే గ్రామానికి చెందిన ఆటోడ్రైవర్ దారంపల్లి రాములు, ముద్దెంగూడకు చెందిన రాములుకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్‌లో షాద్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.