Share News

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం

ABN , Publish Date - Jan 18 , 2025 | 11:56 PM

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకుడు అండేకార్‌ యాదిలాల్‌ అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయం
షాద్‌నగర్‌ : నివాళులర్పిస్తున్న పాతూరి వెంకట్‌రావు తదితరులు

టీడీపీ నాయకులు

రామారావు వర్ధంతి సందర్భంగా నివాళి

ఆమనగల్లు/మొయినాబాద్‌ రూరల్‌/చేవెళ్ల/షాద్‌నగర్‌ రూరల్‌/కేశంపేట/షాద్‌నగర్‌/మంచాల/కందుకూరు, జనవరి 18 (ఆంధ్రజ్యోతి ): ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర లీగల్‌ సెల్‌ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకుడు అండేకార్‌ యాదిలాల్‌ అన్నారు. శనివారం ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్‌ ట్రస్టు భవన్‌లో జరిగిన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రక్తదానం చేసిన యాదిలాల్‌, టీడీపీ నాయకులకు నారా భువనేశ్వరీ ప్రశంసా పత్రాలు అందజేశారు. కండె సత్యం, శ్రీనాథ్‌, గాజుల పద్మనాభం, పంచాక్షరి, అర్థం నర్సింహ తదితరులున్నారు. రామారావు వర్ధంతిని ఆమనగల్లులో టీడీపీ జిల్లా అడహక్‌ కమిటీ సభ్యుడు కొప్పు యాదయ్య ఆధ్వర్యంలో నిర్వహించారు. కండె భాస్కర్‌, మారేపల్లి జంగయ్య, జగన్‌, సత్తయ్య, పాండునాయక్‌ తదితరులున్నారు. ఎన్టీఆర్‌ భారత రాజకీయాల సమాఖ్యీకరణ, ప్రజాస్వామ్యీకరణకు ఎంతో దోహదపడ్డారని ఎన్టీఆర్‌ విద్యాసంస్థల డీన్‌ రామారావు తెలిపారు. హిమాయత్‌ నగర్‌లోని ఎన్టీఆర్‌ విద్యాసంస్థల్లో ఎన్టీఆర్‌ విగ్రహానికి డైరెక్టర్‌ వెంకటేశ్వరావు ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ప్రిన్సిపాల్‌ శ్రీనివా్‌సరావు, ఉపాధ్యాయ బృందం, ఉన్నారు. ఎన్టీఆర్‌ సేవలు చిరస్మరణీయమని చేవెళ్ల కన్వీనర్‌ సభ్యులు సుభాన్‌ అన్నారు. చేవెళ్లలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. రాఘవులు, కత్తి మోదన్‌రావు, శ్రీహరియాదవ్‌, ధర్మయ్యచ కృష్ణయాదవ్‌ తదితరులున్నారు. రామారావు వర్ధంతి వేడుకలను ఫరూఖ్‌నగర్‌ మండలంలోని లింగారెడ్డిగూడ, కొండన్నగూడ, కమ్మదనం తదితర గ్రామాల్లో జరుపుకున్నారు. భాస్కర్‌రెడ్డి, భూపతిరెడ్డి, బక్కని శ్రీను, శివకుమార్‌, హనుమంతు తదితరులున్నారు. నిరుపేదల జీవితాలలో రామరావు వెలుగులు నింపారని టీడీపీ కేశంపేట మండలాధ్యక్షుడు చుక్క శేఖర్‌ గౌడ్‌ అన్నారు. కొత్తపేటలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. గ్రామ ఉపాధ్యక్షుడు గణేష్‌, నాయకులు శ్రవణ్‌ కుమార్‌, శ్రీను, ప్రసాద్‌, పరమేశ్‌, రవి, తదితరులున్నారు. రామారావు సేవలు చిరస్మరణీయమని టీడీపీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇన్‌చార్జి చక్రపాణి అన్నారు. మంచాలలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. మండలాధ్యక్షుడు మహేందర్‌, కృష్ణ, కొంగర వెంకట్‌రెడ్డి, పగడాల ఆనంద్‌, పి.మల్లేష్‌, శంకర్‌, తదితరులున్నారు. నాయకులు ఎగ్గిడి సత్తయ్య, ఇంద్రకంటి రవీందర్‌గౌడ్‌ల ఆధ్వర్యంలో కందుకూరులో ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. మాజీ జెడ్పీటీసీ పెద్దరామయ్య, బొమ్మరాజు మల్లేష్‌, గణపురం అంజయ్య, గడల రాములు, గడిగ మహేందర్‌, గాది సత్తయ్య, తదితరులున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలని కమ్మ సేవా సమితి అధ్యక్షులు పాతూరి వెంకట్‌రావు కోరారు. షాద్‌నగర్‌ మున్సిపల్‌ పరిధి చటాన్‌పల్లిలోని శేషయ్యనగర్‌ కమ్యూనిటీ హాల్‌ సమీపంలో గల ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. షాద్‌నగర్‌ పట్టణ ప్రధాన కూడలిలో నాయకులు చల్లా వెంకటేశ్శర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. కమ్మ సేవాసమితి నాయకులు పినపాక ప్రభాకర్‌, వసంత్‌రావు, బండారుపల్లి నాగేశ్వర్‌రావు, నాయకులు గంధం ఆనంద్‌, వెంకటయ్య గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2025 | 11:56 PM