Share News

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పలువురికి జైలు

ABN , Publish Date - Jan 29 , 2025 | 12:21 AM

మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ అరవింద్‌ హెచ్చరించారు.

డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులో పలువురికి జైలు

మోమిన్‌పేట్‌, జనవరి 28 (ఆంధ్రజ్యోతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని ఎస్‌ఐ అరవింద్‌ హెచ్చరించారు. మోమిన్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో వాహనాల తనిఖీలు నిర్వహించగా డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పలువురు పట్టుబడ్డారని తెలిపారు. మేకవనంపల్లి గ్రామానికి చెందిన చాకలి నర్సింహులు, కేసారం గ్రామానికి చెందిన గుజ్జరి అరుణ్‌కుమార్‌, బర్వాద్‌ గ్రామానికి చెందిన బంటారపు కుమార్‌ మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడగా మంగళవారం జిల్లా కేంద్రంలోని కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పర్చినట్లు తెలిపారు. కోర్టు మెజిస్ర్టేట్‌ ఇంచార్జ్‌ అసిస్టెంట్‌ కలెక్టర్‌ ఉమాహారతి డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో పట్టుబడిన వారికి ఒక రోజు సాధారణ జైలు శిక్ష విధించినట్లు తెలిపారు.

Updated Date - Jan 29 , 2025 | 12:21 AM