రైలుకింద పడి వ్యక్తి ఆత్మహత్య
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:32 PM
రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

ఘట్‌కేసర్‌రూరల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. రైల్వేపోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని మహాత్మాగాంధీ బస్టాండ్ సమీపంలోని ఖాళీ ఖబర్ ప్రాంతానికి చెందిన వై.అనిల్ కుమార్(45) శుక్రవారం ఉదయం బైక్ తీసుకొని ఇంటినుంచి బయటకు వచ్చాడు. ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్ అవుషాపూర్‌లోని రైలుపట్టాలకు కొద్దిదూరంలో బైక్‌ను నిలిపి, సికింద్రాబాద్ నుంచి గుంటూరుకు వెళ్తున్న ఇంటర్‌సిటీ రైలుకింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న రైల్వేపోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి, అక్కడ లభించిన ఆధారాల మేరకు అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనిల్‌కుమార్ ఆత్మహత్యకు గల గల కారణాలు తెలియరాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.