వైభవంగా మైసమ్మ తల్లి బోనాలు
ABN , Publish Date - Jan 19 , 2025 | 11:30 PM
మండలంలోని కోటబాస్పల్లి గ్రామంలో ఆదివారం మైసమ్మ బోనాల జాతర నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలను సమర్పించారు.
తాండూరు రూరల్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కోటబాస్పల్లి గ్రామంలో ఆదివారం మైసమ్మ బోనాల జాతర నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా అమ్మవారికి బోనాలు సమర్పించి నైవేద్యాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాజశేఖర్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నాగార్జున తాండూరు సిటీ కేబుల్ ఎండీ పి.నర్సింహారెడ్డి(బాబు), మాజీ వైస్‌ఎంపీపీ స్వరూపావెంకట్‌రాంరెడ్డి, మండల టీఆర్‌ఎస్ అధ్యక్షుడు ఎస్.వీరేందర్‌రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు నాగప్ప, ఎల్మకన్నె పీఏసీఎస్ డైరెక్టర్ సురేందర్‌రెడ్డి, నాపరాతి వ్యాపారి వి.వెంకట్‌రెడ్డి, డీలర్ నర్సింగ్‌రావు, మాజీ వైస్ ఎంపీపీ మొగులప్ప పాల్గొన్నారు.
వైభవంగా కట్ట మైసమ్మ జాతర
తాండూరు: పట్టణంలోని విజ్ఞానపూరి కాలనీలో వెలసిన కట్ట మైసమ్మ అమ్మవారి జాతర వైభవంగా ప్రారంభమైంది. కౌన్సిలర్ మంకాల రాఘవేందర్ ఆధ్వర్యంలో పల్లకీసేవ స్థానిక భక్తులు నిర్వహించారు. మంకాల రాఘవేందర్ సతీమణి సరితతో కలిసి ప్రత్యేకపూజలు చేశారు. అమ్మవారికి జగదీష్‌స్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక అలంకరణ నిర్వహించారు. మున్సిపల్ చైర్‌పర్సన్ స్వప్న, బీజేపీ నాయకులు శాంత్‌కుమార్, హిందూ ఽధార్మిక పరిషత్ కన్వీనర్ గాజుల బస్వరాజ్, నాయకులు బసన్నలు దర్శించుకున్నారు.