పశువుల పాక దగ్ధం
ABN , Publish Date - Jan 17 , 2025 | 11:33 PM
అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం కాగా రెండు దూడలు మృత్యువాతపడగా ఐదు గేదెలకు తీవ్రగాయాలయ్యాయి.

రెండు దూడలు మృత్యువాత
ఐదు గేదెలకు తీవ్రగాయాలు
పెద్దేముల్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం కాగా రెండు దూడలు మృత్యువాతపడగా ఐదు గేదెలకు తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జనగాం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగారం అనంత్‌రెడ్డికి గేదెలు, ఎడ్లు ఉన్నాయి. ఇంటిసమీపంలోనే పశువుల పాకలు నిర్మించి వాటిని అందులోనే కట్టేస్తారు. ఒక పశువుల పాకకు అర్ధరాత్రి నిప్పంటుకుంది. అందులో సుమారు 10గేదెలు కట్టేసి ఉన్నాయి. అర్ధరాత్రి సుమారు ఒకటిన్నర సమయంలో మెలుకువ వచ్చిన రైతుకు పశువుల పాక దగ్ధమవుతుండటంతో అప్రమత్తమై నీళ్లు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశాడు. కానీ అప్పటికే మొత్తం పశువుల పాక పూర్తిగా దగ్ధమైంది. అందులో కట్టేసిన గేదెలలో ఐదు గేదెలకు నిప్పంటుకుని తీవ్రగాయాలయ్యాయి. రెండు దూడలు మృత్యువాతపడ్డాయి. షార్ట్‌సర్క్యూట్ వల్లే పశువుల పాకకు మంటలు అంటుకుని ఉంటాయని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని బాధిత రైతు కోరాడు.