Share News

భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైౖదు

ABN , Publish Date - Jan 09 , 2025 | 12:20 AM

భార్యను హత్యచేసిన భర్తకు ఎల్బీనగర్‌ కోర్టు రూ.5 వేల జరిమానాతో పాటు జీవిత ఖైౖదు విధించింది. 2021లో మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన అలువాల నర్సింహ(35) తన భార్య లక్ష్మమ్మ(30)ను హత్య చేశాడు.

భార్యను కడతేర్చిన భర్తకు జీవిత ఖైౖదు

మహేశ్వరం, జనవరి 8(ఆంధ్రజ్యోతి): భార్యను హత్యచేసిన భర్తకు ఎల్బీనగర్‌ కోర్టు రూ.5 వేల జరిమానాతో పాటు జీవిత ఖైౖదు విధించింది. 2021లో మహేశ్వరం మండలం మాణిక్యమ్మగూడకు చెందిన అలువాల నర్సింహ(35) తన భార్య లక్ష్మమ్మ(30)ను హత్య చేశాడు. అప్పటి సీఐ మధుసూదన్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి నర్సింహను రిమాండ్‌కు తరలించారు. అప్పటి నుంచి విచారణలో ఉన్న ఈ కేసులో నర్సింహకు ఎల్బీనగర్‌ కోర్టు జీవితఖైదు విఽధిస్తూ బుధవారం తీర్పునిచ్చిందని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 12:20 AM