Share News

అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:04 AM

జీవనోపాధి కోసం వచ్చిన కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది.

అనుమానాస్పద స్థితిలో కూలీ మృతి

మూడుచింతలపల్లి, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): జీవనోపాధి కోసం వచ్చిన కూలీ అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈ ఘటన శామీర్‌పేట్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మజీద్‌పూర్‌ గ్రామానికి జీవనోపాధి కోసం వచ్చిన బిలా్‌షకుమార్‌ (23)ఓఇంట్లో అద్దెకు ఉంటూ స్థానికంగా ఉన్న హెచ్‌బీఎల్‌ కంపెనీలో కూలీపని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం పని ముగించుకుని వచ్చిన తను పెంట్‌హౌ్‌సలో టవల్‌తో ఉరేసుకుని విగతజీవిగా కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవపంచనామా నిర్వహించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 07 , 2025 | 12:04 AM