ఫోన్‌ట్యాపింగ్‌పై జూబ్లీహిల్స్ పోలీసుల విచారణ
ABN , Publish Date - Jan 22 , 2025 | 12:06 AM
శాసనసభ ఎన్నికల ముందు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళి కృష్ణగౌడ్ కు సంబంధించిన సెల్‌ఫోన్‌ను ట్రాప్ చేశారని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం విచారణ జరిపారు.
తాండూరు, జనవరి 21(ఆంధ్రజ్యోతి): శాసనసభ ఎన్నికల ముందు జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళి కృష్ణగౌడ్ కు సంబంధించిన సెల్‌ఫోన్‌ను ట్రాప్ చేశారని జూబ్లీహిల్స్ పోలీసులు మంగళవారం విచారణ జరిపారు. అప్పట్లో ప్రభుత్వానికి సంబంధించి కొంత మంది అధికారులు బీఆర్‌ఎస్‌లో ఉంటూ పార్టీ మారిన కొంత మంది ముఖ్యమైన వ్యక్తుల ఫోన్‌ట్యాపింగ్ చేశారని, పోలీసులకు నివేదిక అందింది. ఈ నివేధిక ఆధారంగా గ తంలో తాండూరు సీనియర్ నాయకులు డాక్టర్ సంపత్ కుమార్‌ను పోలీసులు విచారించారు. మంగళవారం జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ మురళి గౌడ్‌ను జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిపించి రెండు గంటల పాటు విచారించారు. అయితే తన ఫోన్ ట్యాపింగ్ జరుగుతుందని అనుమానంతోనే ముందుగానే తాను పోలీసులకు ఫిర్యాదు ఇచ్చినప్పటికి పట్టించుకోలేదని, ఈ విషయంలో నిజనిజాలు తేలాలని తన ఫోన్ ఎవరు ట్యాపింగ్ చేశారో తేల్చే వరకు పోలీసులకు సహకరిస్తానని మురళి కృష్ణ గౌడ్ చెప్పారు.