Share News

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్‌ సీజ్‌

ABN , Publish Date - Jan 13 , 2025 | 12:12 AM

మండల పరిధిలోని కాకునూర్‌ గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం కేశంపేట పోలీసులు సీజ్‌ చేశారు.

అక్రమంగా ఇసుక తరలింపు.. ట్రాక్టర్‌ సీజ్‌

కేశంపేట, జనవరి 12(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని కాకునూర్‌ గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను ఆదివారం కేశంపేట పోలీసులు సీజ్‌ చేశారు. కేశంపేట ఇన్‌స్పెక్టర్‌ నరహరి తెలిపిన వివరాల ప్రకారం.. కాకునూర్‌ గ్రామ శివారులోని పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారన్న సమాచారంతో పీసీ సీహెచ్‌ శ్రీశైలం పెట్రోలింగ్‌ వాహనంతో వెళ్లి కాకునూర్‌లో తనిఖీలు చేయగా, ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను గుర్తించారని తెలిపారు. డ్రైవర్‌ను అనుమతులు చూపించాల్సిందిగా కోరగా.. లేవని చెప్పడంతో ఇసుక లోడ్‌తో ఉన్న ట్రాక్టర్‌ను సీజ్‌ చేశారు. అనంతరం పోలీస్‌ స్టేష్‌న్‌కు తరలించినట్లు తెలిపారు. ఈమేరకు కానిస్టేబుల్‌ సీహెచ్‌ శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వివరించారు.

Updated Date - Jan 13 , 2025 | 12:12 AM