భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్య
ABN , Publish Date - Jan 16 , 2025 | 12:18 AM
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడ్తాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు..

కడ్తాల్, జనవరి 15 (ఆంధ్రజ్యోతి): భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడ్తాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. మండల కేంద్రానికి చెందిన సిద్దిగారి శివశంకర్‌కు మహబూబ్ నగర్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి గ్రామానికి చెందిన మౌనికతో 2024లో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం నుంచీ భార్యాభర్తలు తరచూ గొడవపడేవారు. మౌనిక వేరే వారితో ఫోన్‌లో మాట్లాడుతోందని భర్త శివశంకర్ అనుమానించేవాడు. ఈ క్రమంలో మౌనిక, శివశంకర్‌లు గొడవపడ్డారు. దాంతో శివశంకర్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని అత్మహత్యకు పాల్పడ్డాడు. తల్లి రాములమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.