రైతు సంక్షేమానికి పెద్దపీట
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:54 PM
రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రూ. 40వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు.

రూ.2వేల కోట్లతో కోహెడలో మెగా మార్కెట్ యార్డు
మొయినాబాద్‌లో కొత్త మార్కెట్ ఏర్పాటుకు కృషి..
మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్
షాబాద్ / చేవెళ్ల, జనవరి 6(ఆంధ్రజ్యోతి): రైతుల అభ్యున్నతే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రూ. 40వేల కోట్ల రుణమాఫీ చేసిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం షాబాద్ మండలం సర్దార్‌నగర్ మార్కెట్ ప్రాంగణంలో నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్, మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డిలతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఔటర్ రింగ్‌రోడ్ సమీపంలో కోహెడ వద్ద రూ. 2వేల కోట్లతో మెగా మార్కెట్ ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. ఈ మార్కెట్‌లో పూలు, పండ్లు, కూరగాయాలతో పాటు రైతులు పండించే ప్రతీ పంటను విక్రయించుకోవచ్చన్నారు. ఎమ్మెల్యే యాదయ్య, భీంభరత్ కోరిక మేరకు మొయినాబాద్‌లో కొత్త మార్కెట్ యార్డును ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతుల కోసం బడ్జెట్‌లో 35 శాతానికిపైగా నిధులు కేటాయించినట్లు తెలిపారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీని విడతల వారీగా చేసిందన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేసిందని ఆయన అన్నారు. జనవరి 26 నుంచి రైతు భరోసా కోసం రూ. 10 వేల కోట్లు కేటాయిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా వానాకాలం నుంచి పంట బీమాకు రూ.3500 కోట్లు కేటాయించి రైతులకు పూర్తిస్థాయి నష్టపరిహారం ప్రభుత్వం అందిస్తుందన్నారు. రైతుబీమాకు రూ. 3వేల కోట్లు ఇస్తున్నామన్నారు. అనంతరం ఏఎంసీ నూతన పాలకవర్గం చైర్మన్‌గా పీసరి సురేందర్‌రెడ్డి, వైస్‌చైర్మన్‌గా జంగయ్య, డైరెక్టర్లుగా అక్తర్‌పాష, నర్సింహులు, లలిత, బాలకృష్ణారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, రమేష్, జైపాల్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీరాంరెడ్డి, సంజీవరెడ్డి, సంతో్‌షకుమార్, మహాత్మలతో జిల్లా మార్కెటింగ్ అధికారి రియాజ్ ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా పీసరి సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ... రైతులు పండించిన పంటలకు మద్దతు ధర అందేలా చూస్తామన్నారు. మార్కెట్‌లో రైతులకు అవసరమైన మౌళిక వసతులు కల్పనకు తమవంతు కృషి చేస్తామన్నారు. కార్యక్రమాల్లో మాజీ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ యాదవరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు నర్సింహ్మారెడ్డి, రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డు సభ్యులు చింపుల సత్యనారాయణరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ పి. కృష్ణారెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ ఇన్‌చార్జి పామెన భీంభరత్, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి గౌరీ సతీష్, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్‌రెడ్డి, గోనే ప్రతా్‌ఫరెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి. రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, ప్రభాకర్ పాండుయాదవ్, సత్యనారాయణ, సున్నపు వసంతం, ఎం. యాదగిరి, బండారు అగిరెడ్డి, నర్సింలు, మహేందర్‌రెడ్డి, నాగుల్‌రెడ్డి, మాదవరెడ్డి, రాంచంద్రయ్యగౌడ్, మాణిక్యరెడ్డి, సుబా్‌షగౌడ్, చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింలు, మా ణిక్యం, ఉదయ్‌మోహన్‌రెడ్డి, షాబాద్ దర్శన్, కా వలి చంద్రశేఖర్, మాణయ్య, అశ్విని, శేఖర్‌రెడ్డి, ప్రతా్‌పరెడ్డి, వెంకట్‌రెడ్డి, పెంటయ్యగౌడ్, రాం రెడ్డి, కృష్ణారెడ్డి, నాయకులు మొగిలిద్ద లక్ష్మీనర్సింహారెడ్డి, పీసరి వెంకట్‌రెడ్డి, మధుసూదన్‌గుప్తా, రాహుల్‌గుప్తా, చెన్నయ్య, నర్సింహులు, జ నార్దన్‌రెడ్డి, హన్మంత్‌యాదవ్, మహేందర్‌గౌడ్, తమ్మలి రవీందర్, అశోక్, అశ్వక్‌అలీ, బర్ల యా దయ్య, ఖాజమియా, చేవెళ్ల స్వామి, రాంరెడ్డి, న రేందర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, వేణు, బుచ్చయ్య, యా దగిరి, రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గ్రామీణ రహదారులకు పెద్దపీట
గ్రామీణ రహదారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. సోమవారం షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడ వద్ద ఈసీ వాగుపై రూ.5 కోట్లతో నిర్మించిన బ్రిడ్జిని, ఏట్లఎర్రవల్లి గ్రామంలో రూ.10 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు మరియు బీసీ భవనాన్ని ప్రారంభించారు. ఏట్ల ఎర్రవల్లి వద్ద వాగుపై రూ.2 కోట్లతో నిర్మించే వంతెనకు శంకుస్థాపన చేశారు. అనంతరం సర్దార్‌నగర్ గ్రామంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీలు సునీతారామస్వామి, పాండు, పీఏసీఎస్ వైస్ చైర్మన్ మల్లేష్, మాజీ సర్పంచులు రవీందర్‌నాయక్, జనార్దన్‌రెడ్డి, అంజనేయులు, శకుంతల ఉన్నారు.