Share News

పేయింటర్‌ అదృశ్యం

ABN , Publish Date - Jan 09 , 2025 | 11:39 PM

పేయింటర్‌ అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది.

పేయింటర్‌ అదృశ్యం

ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 9 (ఆంధ్రజ్యోతి): పేయింటర్‌ అదృశ్యమైన ఘటన ఘట్‌కేసర్‌ పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ పరశురాం తెలిపిన వివరాల ప్రకారం.. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ ఎన్‌ఎ్‌ఫసీ నగర్‌కు చెందిన బొజ్జ మనోజ్‌ కుమార్‌(22) పేయింటర్‌ పనిచేస్తుంటాడు. గతేడాది డిసెంబరు 24వ తేదీన మద్యం సేవించి వచ్చి కుటుంబసభ్యులతో గొడవకు దిగాడు. దీంతో తల్లి తాగివచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావని మందలించడంతో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. ఎన్ని చోట్ల వెతికినా, మిత్రులను, బంధువులను ఆరా తీసినా ఆచూకీ లభించలేదు. దీంతో గురువారం పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Jan 09 , 2025 | 11:39 PM