వ్యక్తి అదృశ్యం
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:37 PM
వ్యక్తి అదృశ్యమైన ఘటన శంషాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు..జ మండల పరిధి పెద్దగోల్కొండకు చెందిన దూడల సాయిలుగౌడ్(55) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 3న మద్యం సేవించి ఇంటికొచ్చాడు.

శంషాబాద్ రూరల్, జనవరి 7(ఆంధ్రజ్యోతి): వ్యక్తి అదృశ్యమైన ఘటన శంషాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో మంగళవారం జరిగింది. సీఐ నరేందర్‌రెడ్డి కథనం మేరకు..జ మండల పరిధి పెద్దగోల్కొండకు చెందిన దూడల సాయిలుగౌడ్(55) కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 3న మద్యం సేవించి ఇంటికొచ్చాడు. దాంతో ఆయన కుమారుడు అరుణ్‌కుమార్‌గౌడ్ తండ్రిని మందలించాడు. మధ్యాహ్నం 3 గంటలకు ఎవరికీ చెప్పకుండా సాయిలుగౌడ్‌ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి ఇంటికి రాకపోవడంతో బంధువులు, స్నేహితుల వద్ద ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు శంషాబాద్ పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.