వాహనం ఢీకొని జింకకు గాయాలు
ABN , Publish Date - Feb 07 , 2025 | 11:53 PM
గుర్తు తెలియని వాహనం ఢీకొని జింకకు గాయాలైన సంఘటన నవాబుపేట మండలంలో జరిగింది.

నవాబుపేట, ఫిబ్రవరి 7 (ఆంధ్రజ్యోతి): గుర్తు తెలియని వాహనం ఢీకొని జింకకు గాయాలైన సంఘటన నవాబుపేట మండలంలో జరిగింది. మండలంలోని బంగారు మైసమ్మ గ్రామ సమీపంలో శుక్రవారం ఓ జింక రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. గమనించిన ఎగ్మండి గ్రామానికి చెందిన అఫ్ఝల్ అనే ఆర్‌ఎంపీ వైద్యుడు ప్రథమ చికిత్స నిర్వహించి వికారాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.