Share News

గుర్తుతెలియని వ్యక్తి మృతి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:28 PM

అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాల్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపల్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సమీపంలో గుర్తు తెలియని శవం ఉందని డయల్‌ 100కు కాల్‌ రాగా.. పెట్రోల్‌ మొబైల్‌ 2లో విధులు నిర్వహిస్తున్న కె.శేఖర్‌, హోంగార్డ్‌ బాలాజీలు ఘటన స్థలానికి వెళ్లారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

శంషాబాద్‌ రూరల్‌, జనవరి 17 (ఆంఽధ్రజ్యోతి) : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆర్జీఐఏ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాల్‌రాజ్‌ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపల్‌ పరిధిలోని ఓఆర్‌ఆర్‌ సమీపంలో గుర్తు తెలియని శవం ఉందని డయల్‌ 100కు కాల్‌ రాగా.. పెట్రోల్‌ మొబైల్‌ 2లో విధులు నిర్వహిస్తున్న కె.శేఖర్‌, హోంగార్డ్‌ బాలాజీలు ఘటన స్థలానికి వెళ్లారు. దాదాపు 50 ఏళ్ల వయస్సు కలిగిన మృతి చెంది ఉన్నాడు. పరిసరాలను పరిశీలించగా.. పోలీసులకు కొంత దూరంలో సంచి కనిపించింది. అందులో ఆధార్‌ కార్డు లభించింది. అందులో మహ్మద్‌ అమనుల్లా, తండ్రి పేరు అబ్దుల్లా అని ఉంది. మృతదేహాన్ని ఉస్మానియాకు తరలించారు. మృతుడి ఒంటిపై మిలటరీ ప్యాంట్‌, బ్లాక్‌ కలర్‌ టీషర్టు ఉందని, సమీపంలో ఒక మద్యం బాటిల్‌ ఉందని పోలీసులు తెలిపారు. కాగా, మద్యం సేవించి మృతి చెందాడా? లేక ఫిట్స్‌ వచ్చి మృతి చెందాడా? లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతుడి ఒంటిపై ఎలాంటి గాయలు లేవని పోలీసులు తెలిపారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

Updated Date - Jan 17 , 2025 | 11:28 PM