Share News

అన్నదాతలను మోసగించిన కాంగ్రెస్‌

ABN , Publish Date - Jan 07 , 2025 | 12:02 AM

అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవుళ్లపై ఒట్లు పెట్టి, అధికారం రాగానే అన్నదాతలను అడుగడుగునా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగిస్తూపోతున్నదని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పిలుపుమేరకు సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండల తహసీల్దార్‌ ఆఫీసు ఎదుట రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధర్నా చేపట్టారు. బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు హాజరై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు.

అన్నదాతలను మోసగించిన కాంగ్రెస్‌
షాద్‌నగర్‌ అర్బన్‌ : ఫరూఖ్‌నగర్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నాలో నాయకులు

షాద్‌నగర్‌ అర్బన్‌/కడ్తాల్‌, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ ఎన్నికలకు ముందు దేవుళ్లపై ఒట్లు పెట్టి, అధికారం రాగానే అన్నదాతలను అడుగడుగునా కాంగ్రెస్‌ ప్రభుత్వం మోసగిస్తూపోతున్నదని బీఆర్‌ఎస్‌ నాయకులు మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌ పిలుపుమేరకు సోమవారం ఫరూఖ్‌నగర్‌ మండల తహసీల్దార్‌ ఆఫీసు ఎదుట రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలను అమలు చేయాలని ధర్నా చేపట్టారు. బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు హాజరై కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు రూ.2లక్షల రుణ మాఫీ, ప్రతీ ఎకరాకు రూ.15వేల పెట్టుబడి సాయం, ధాన్యం సన్నాలకు రూ.500 బోనస్‌, కౌలు రైతులకు సైతం ఎకరాకు రూ.15వేల రైతు బంధును ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ మాట తప్పిందన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ నరేందర్‌, కేశంపేట మాజీ ఎంపీపీ రవీందర్‌యాదవ్‌, షాద్‌నగర్‌ మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ నారాయణరెడ్డి, జడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ గణేష్‌, సింగిల్‌విండో చైర్మన్‌ బక్కన్న యాదవ్‌, మున్సిపల్‌ వైస్‌చైర్మన్‌ నటరాజ్‌, బీఆర్‌ఎస్‌ నాయకులున్నారు. రైతు భరోసా కింద ఎకరాకు రూ.15వేలు పెట్టుబడి సాయం అందిస్తామన్న కాంగ్రెస్‌ ప్రస్తుతం రూ.12 వేలు ఇస్తామంటూ రైతులను దగా చేస్తున్నారని ఆరోపిస్తూ కడ్తాల మండల కేంద్రంలో బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌-శ్రీశైలం జాతీయ రహదారిపై నిరసన ర్యాలీ నిర్వహించారు. లంబాడ హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ జడ్పీటీసీ దశరథ్‌నాయక్‌, డీసీసీబీ డైరెక్టర్‌ వెంకటేశ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా నాయకుడు వీరయ్యలు హాజరయ్యారు. స్థానిక బస్టాండ్‌ కూడలిలో బైటాయించి ధర్నా, రాస్తారో కో నిర్వహించారు. సేవ్యనాయక్‌, వెంకటేశ్‌, యాదయ్యగౌడ్‌, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.

రైలుకింద పడి యువకుడి ఆత్మహత్య

శంకర్‌పల్లి, జనవరి 6(ఆంధ్రజ్యోతి): అప్పుల బాధ భరించలేక ఓ యువకుడు రైలుకింద పడి ఆత ్మహత్య చేసుకున్నాడు. వికారాబాద్‌ రైల్వే పోలీసుల కథనం మేరకు శంకర్‌పల్లి మున్సిపల్‌ పరిధి ఫత్తేపురంనకు చెందిన బి.మనోహర్‌ యాదవ్‌(26) ఫత్తేపురంలోనే పశువుల దానా దుకాణం పెట్టుకుని జీవనం సాగించేవాడు. దుకాణం సరిగా నడవకపోవడంతో అప్పులు పెరిగిపోయాయి. మనోహర్‌ జీవితంపై విరక్తిచెంది ఆదివారం రాత్రి ఫత్తేపురంలో రైలుకింద పడి చనిపో యాడు. సోమవారం ఉదయం స్థానికులు గమనించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఈమేరకు వికారాబాద్‌ ఆసుపత్రికి మృతదేహాన్ని తరలించారు.

Updated Date - Jan 07 , 2025 | 12:02 AM