Share News

బాల్య వివాహం చేసిన వారిపై ఫిర్యాదు

ABN , Publish Date - Jan 16 , 2025 | 11:29 PM

బాల్యవివాహం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన బాలిక(15) స్థానికంగా 9వ తరగతి చదువుతూ మానేసింది.

బాల్య వివాహం చేసిన వారిపై ఫిర్యాదు

తాండూరు రూరల్‌, జనవరి 16, (ఆంధ్రజ్యోతి): బాల్యవివాహం చేసిన వారిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. మండలంలోని మల్కాపూర్‌ గ్రామానికి చెందిన బాలిక(15) స్థానికంగా 9వ తరగతి చదువుతూ మానేసింది. చదువు మానేసిన బాలికను కడప జిల్లా పులివెందుల మండలం అమ్మకాపల్లికి చెందిన సాయికుమార్‌(26)తో 24 అక్టోబరు 2024లో కుటుంబీకులు పులివెందులలోనే బాల్యవివాహం జరిపారు. విషయం తెలుసుకున్న మల్కాపూర్‌ అంగన్‌వాడీ టీచర్‌ మన్‌సాన్‌పల్లి ఆశమ్మ, చైల్డ్‌లైన్‌ కమిటీ ఆదేశాల మేరకు బాల్య వివాహం జరిగిందని తెలుసుకుంది. ఇట్టి విషయాన్ని స్మైల్‌ ఆపరేషన్‌ టీం సభ్యులు ఎస్‌ఐ మహిపాల్‌రెడ్డి, నరే్‌షకుమార్‌, చైల్డ్‌లైన్‌ చంద్రప్పతో కలిసి బాలిక ఇంటికి వెళ్లి వివరాలు తెలుసుకున్నారు. ఈమేరకు వివాహ ఫొటోలు సేకరించి తగు చర్యలు తీసుకోవాలని కరన్‌కోట్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - Jan 16 , 2025 | 11:29 PM