Share News

సిమెంట్‌ లారీ బోల్తా

ABN , Publish Date - Feb 04 , 2025 | 12:02 AM

బుగ్గ సమీపంలో సిమెంట్‌ లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సిమెంట్‌ లారీ బోల్తా
బుగ్గ సమీపంలో బోల్తాపడిన సిమెంట్‌ లారీ

  • వాహనాల రాకపోకలకు అంతరాయం

వికారాబాద్‌, ఫిబ్రవరి 3 (ఆంధ్రజ్యోతి): బుగ్గ సమీపంలో సిమెంట్‌ లారీ అదుపు తప్పి బోల్తా పడడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. తాండూరు నుంచి సిమెంట్‌, బండ్డరాళ్ల లోడ్‌తో వచ్చే వాహనాలు అనంతగిరి ఘాట్‌ రోడ్డు ఎక్కెపరిస్థితి లేకపోవడంతో బుగ్గ రోడ్డు మార్గంలో వికారాబాద్‌ చేరుకుని ఇక్కడి నుంచి వెళుతాయి. సోమవారం రాత్రి సైతం ఓ సిమెంట్‌ లారీ అటుగా వస్తు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో ఆ దారి గుండా వచ్చే వాహనాలు నిలిచిపోయి కొంత ఇబ్బంది ఏర్పడింది.

Updated Date - Feb 04 , 2025 | 12:02 AM