Share News

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు

ABN , Publish Date - Jan 22 , 2025 | 12:09 AM

ప్రజాపాలన గ్రామ సభలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకుని నెట్టివేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపారు.

కానిస్టేబుల్‌పై చేయి చేసుకున్న ఇద్దరిపై కేసు

ధారూరు, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): ప్రజాపాలన గ్రామ సభలో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్‌పై చేయిచేసుకుని నెట్టివేసిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపారు. మండలంలోని మైలారం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ రాందా్‌సను మైలారం ముందలి తండాకు చెందిన అంగోత్‌ బద్య నాయక్‌, రమావత్‌ శ్రీనివా్‌సలు మద్యంమత్తులో చేయిచేసుకుని నెట్టివేశారు. కానిస్టేబుల్‌ ఫిర్యాదు ఆధారంగా ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Jan 22 , 2025 | 12:09 AM