వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కేసు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:29 PM
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కులకచర్ల పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

కులకచర్ల, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): వృద్ధురాలిపై దాడికి పాల్పడిన మనువడిపై కులకచర్ల పోలీసులు కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. మండలంలోని బిందెం గడ్డ తండాకు చెందిన కోటమ్మ(90) కుమారుడు, కోడలు మృతిచెందారు. వారికి నలుగురు కుమారులు హరిచందర్, రాజు, నాను, లక్ష్మణ్ ఉన్నారు. లక్ష్మణ్ ఇంటి దగ్గరే ఉంటున్నాడు. తరచూ నానమ్మ కోటమ్మతో గొడవ పడుతుండేవాడు. ఈ క్రమంలో గత సోమవారం గొడవపడి కోటమ్మపై దాడిచేశాడు. దీంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఆమె పెద్ద మనువడు హరిచందర్ ఫిర్యాదు మేరకు గురువారం లక్ష్మణ్‌పై కేసు నమోదుచేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.