మైనర్లతో పనిచేయిస్తున్న యజమానులపై కేసు
ABN , Publish Date - Jan 16 , 2025 | 11:28 PM
మైనర్లతో పనిచేయిస్తున్న నలుగురు దుకాణం యజమానులపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఘట్‌కేసర్ రూరల్, జనవరి 16 (అంధ్రజ్యోతి): మైనర్లతో పనిచేయిస్తున్న నలుగురు దుకాణం యజమానులపై ఘట్‌కేసర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ పరశురాం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బాలకార్మిక వ్యవస్థను రూపుమాపాలని చేపట్టిన ఆపరేషన్ స్మైల్‌లో భాగంగా గురువారం ఘట్‌కేసర్ పోలీసులు పలుదుకాణాలు, పరిశ్రమల్లో దాడులు నిర్వహించారు. ఘట్‌కేసర్ ఈడబ్ల్యుఎస్ కాలనీలోని రాజ్‌మార్ట్‌లో పనిచేస్తున్న ఓ మైనర్‌ను, కొండాపూర్‌లోని ఇటుకబట్టీల్లో పనిచేస్తున్న బాలుడిని, శివారెడ్డిగూడలోని ఫాల్‌సీలింగ్ దుకాణంలో పనిచేస్తున్న బాలుడిని, ఎన్‌ఎ్‌ఫసీనగర్‌లో సాగర్ అనే మేస్త్రీ వద్ద పనిచేస్తున్న బాలకార్మికున్ని పోలీసులు అదుపులోకి తీసుకుని హోంకు పంపించారు. అనంతరం దుకాణం యజమానులు, మేస్ర్తీపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
పోచారం ఐటీసీ పోలీసుస్టేషన్‌లో ఒకరు
పోచారం ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్ పరిధిలోని అన్నోజిగూడ ఎన్టీపీసీ చౌరస్తా వద్ద స్టీల్ దుకాణంలో పనిచేస్తున్న మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకోని హోంకు తరలించి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు సీఐ రాజువర్మ తెలిపారు.