Share News

బొలెరో-కారు ఢీ.. ఒకరి మృతి

ABN , Publish Date - Jan 06 , 2025 | 11:58 PM

బోలెరో.. కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పరమేష్‌ కథనం మేరకు..

బొలెరో-కారు ఢీ.. ఒకరి మృతి

ముగ్గురికి తీవ్ర గాయాలు

కందుకూరు, జనవరి 6(ఆంధ్రజ్యోతి): బోలెరో.. కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ఒకరు మృతిచెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై పరమేష్‌ కథనం మేరకు.. బాలన్పల్లి గ్రామం, తాడూరు మండలం, నాగర్‌కర్నూల్‌ జిల్లాకు చెందిన భారూ భరత్‌(20)తో పాటు అదే గ్రామానికి చెందిన కొమ్ము దయాకర్‌, పసుపుల కు మార్‌, ఎం.రమేష్‌, జి.సాయి బోలెరో డ్రైవర్‌, వెలిజల శివకుమార్‌లతో కలిసి ఎండు మి ర్చి అమ్మడానికి శనివారం గ్రామం నుంచి బయలుదేరారు. మార్గమధ్యలో కందుకూరు మండలంలోని దెబ్బడగూడ గేటు వద్ద కా రు కందుకూరు నుంచి కడ్తాల మండలానికి వెళుతుండగా బొలెరో వాహనం రాత్రి 11 గంటల సమయంలో బలంగా ఢీకొట్టింది. బొలెరోలో ఉన్న భరత్‌కు తీవ్రగాయాలు, మిగిలిన వారికి రక్తగాయాలు కావడంతో నగరంలోని ఓ ఆస్పత్రికి తరలిస్తుంగా భరత్‌ మార్గమధ్యలో మృతిచెందాడు. భరత్‌ ఐటీఐ సె కండియర్‌ చదువుతున్నట్లు ఎస్సై పరమే ష్‌ తెలిపారు. కేసు నమోదు చేసుకొని ద ర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

డీసీఎం టైర్ల కింద పడి కార్మికుడి దుర్మరణం

ఇబ్రహీంపట్నం, జనవరి 6(ఆంధ్రజ్యోతి): మండల పరిధి శేరిగూడ వద్ద సోమవారం ఓ కోళ్ల ఫీడింగ్‌ మిల్లులో డీసీఎం చక్రాల కిందపడి బిహార్‌కు చెందిన కార్మికుడు అక్కడిక్కడే మృతిచెందాడు. బిహార్‌కు చెందిన ఆకాష్‌ (20) మల్లికార్జున కోళ్ల ఫీడింగ్‌ మిల్‌లో లేబర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం దాణా లోడ్‌తో బయటకు వస్తున్న డీసీఎంను ఆకాష్‌ ముందునుంచి ఎక్కుతుండగా డ్రైవర్‌ డీసీఎంను ముందుకు పోనివ్వడంతో అదుపుతప్పి ఆకాష్‌ టైర్లకింద పడ్డాడు. చక్రాలకింద నలిగి గాయపడ్డ ఆకాష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రామకృష్ణ తెలిపారు.

Updated Date - Jan 06 , 2025 | 11:59 PM