తాండూరులో బాల్కీ గ్యాంగ్ హల్‌చల్
ABN , Publish Date - Jan 09 , 2025 | 12:18 AM
తాండూరు మండ లంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ హల్‌చల్ చేస్తుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్ తాండూరు నియోజకవర్గంలోని గ్రామా ల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.
తాండూరు రూరల్, జనవరి 8, (ఆంధ్రజ్యోతి): తాండూరు మండ లంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన గ్యాంగ్ హల్‌చల్ చేస్తుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ఈ గ్యాంగ్ తాండూరు నియోజకవర్గంలోని గ్రామా ల్లో వరుస చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. బుధవారం మండల పరిధిలోని కరన్‌కోట్ పోలీసులు ఈ గ్యాంగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు విడుదల చేశారు. ఈ నెల 1న తాండూరు మండలం కోణాపూర్‌లో నాలుగు ఇళ్లల్లో చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ చోరీల వెనుక కర్ణాటకకు చెందిన బాల్కీ గ్యాంగ్ ఉన్నట్లు నిర్ధారించారు. మొత్తం నలుగురు ఉండే గ్యాంగ్ తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకొని చోరీలకు పాల్పడతారని గుర్తించారు. చోరీ చేయాల్సిన గ్రామానికి సమీపంలో ఏదో ఒక ప్రాంతంలో రాత్రిపూట బసచేసి చోరీలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. వచ్చిన పని ముగిశాక అక్కడి నుంచి వెళ్లిపోతారని తెలిపారు. తాండూరు మండలం కోణాపూర్‌లో చోరీలకు పాల్పడినట్లు గుర్తించామని, కోణాపూర్‌తోపాటు తాండూరు మండలం ఖాంజాపూర్, యాలాల మండలం కోకట్ గ్రామ శివారులో సంచరినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఈ గ్యాంగ్ గురించి ఏమైనా సమాచారం తెలిస్తే తాండూరు డీఎస్పీ(87126 70017), తాండూరు రూరల్ సీఐ(87126 70051), టౌన్ సీఐ (87126 70049), కరన్‌కోట్ ఎస్‌ఐ (87126 70052), యాలాల ఎస్‌ఐ (87126 70054), పెద్దేముల్ ఎస్‌ఐ (87126 70053), బీషీరాబాద్ ఎస్‌ఐ (87126 70055)లను సంప్రదించాలని కోరారు.