Share News

అర్హులందరికీ సంక్షేమ పథకాల వర్తింపు

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:31 PM

రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కేశంపేట మండల ప్రత్యేకాధికారి రాజారత్నం అన్నారు.

అర్హులందరికీ సంక్షేమ పథకాల వర్తింపు
మొయినాబాద్‌ రూరల్‌ : అప్పోజిగూడలో భూములను పరిశీలిస్తున్న తహసీల్దార్‌ గౌతమ్‌ కుమార్‌

కేశంపేట, జనవరి 17(ఆంధ్రజ్యోతి): రేషన్‌ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కేశంపేట మండల ప్రత్యేకాధికారి రాజారత్నం అన్నారు. శుక్రవారం అల్వాలలో ఎంపీడీవో రవిచంద్రకుమార్‌ రెడ్డితో కలిసి సర్వేని పరిశీలించారు. అనంతరం మండల పరిషత్‌ ఆఫీసులో తహసీల్దార్‌ మీర్‌ఆజంఅలీ, ఎంఏవో శిరీష, ఎంపీవో కిష్టయ్య, ఏపీవో అజీజ్‌, సర్వే టీమ్‌తో సమావేశమయ్యారు.

చౌదరిగూడ : కొందుర్గు, జిల్లేడ్‌ చౌదరిగూడ మండలాల్లో అధికారులు సర్వే నిర్వహించి వివరాలను సేకరిస్తున్నారు. తహసీల్దార్లు జగదశ్వర్‌, రమే్‌షకుమార్‌, ఎంపీడీవోలు ప్రవీణ్‌కుమార్‌, లక్ష్మీఅనురాధ, ఏవో రాజేందర్‌రెడ్డి, ఉపతహాసీల్దార్‌ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

యాచారం : అర్హులందరికీ రేషన్‌కార్డుల జారీకి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా సమగ్ర శిశు సంక్షేమ శాఖ అధికారి సంద్యారాణి తెలిపారు. గున్‌గల్‌లో సర్వే చేశారు. యాచారం మండల కేంద్రంలో ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలతలు సర్వే చేశారు. సర్వేలో నిర్లక్ష్యం తగదని అదనపు కలెక్టర్‌ కలెక్టర్‌ప్రతిమాసింగ్‌ రైతు వేదిక వద్ద ఎంపీడీవో నరేందర్‌రెడ్డి, ఎంపీవో శ్రీలతను ఆదేశించారు. ఆర్‌డీవో అనంతరెడ్డి, తహసీల్దారు అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు.

ృమొయినాబాద్‌ రూరల్‌ : రైతు భరోసా పథకానికి నిజమైన లభ్దిదారులను గుర్తించాలని, ఇందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలని మొయినాబాద్‌ తహసీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ తెలిపారు. అప్పోజిగూడ, కేతిరెడ్డిపల్లి, చాకలిగూడ, చిలుకూరు తదితర గ్రామాల్లో రెవెన్యూ సిబ్బందితో కలిసి పర్యటించారు. సాగు పంటలను పరిశీలించారు. కార్యక్రమం లో డీటీ వినోద్‌, ఆర్‌ఐలు రోజా, అజిత్‌రెడ్డి రెవెన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

Updated Date - Jan 17 , 2025 | 11:31 PM