Share News

పాడి గేదెలు అపహరణ

ABN , Publish Date - Jan 04 , 2025 | 12:13 AM

మండల పరిధిలోని నందివనపర్తిలో గురువారం రెండు పాడి గేదెలతో పాటు రెండు దూడలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. గ్రామానికి చెందిన గొరిగె చంద్రయ్య గురువారం సాయంత్రం పొలం వద్ద గేదెలు, దూడలను దొడ్డిలో కట్టేసి రాత్రి ఇంటికెళ్లాడు.

పాడి గేదెలు అపహరణ

యాచారం, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మండల పరిధిలోని నందివనపర్తిలో గురువారం రెండు పాడి గేదెలతో పాటు రెండు దూడలను గుర్తు తెలియని దుండగులు అపహరించారు. గ్రామానికి చెందిన గొరిగె చంద్రయ్య గురువారం సాయంత్రం పొలం వద్ద గేదెలు, దూడలను దొడ్డిలో కట్టేసి రాత్రి ఇంటికెళ్లాడు. శుక్రవారం ఉదయం పాలు పితకడానికి వెళ్లిచూడగా పాడి గేదె లు దూడలు కనిపించకపోవడంతో చుట్టుపక్కల వెతికినా ఫలితం లేకపోయింది. దాం తో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గేదెల వి లువ సుమారు రూ.లక్షా 50వేలు ఉంటుందని రైతు తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 04 , 2025 | 12:13 AM