Share News

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ABN , Publish Date - Jan 17 , 2025 | 11:31 PM

రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బొంరా్‌సపేట్‌ మండలంలో జరిగింది. ఎస్‌ఐ అబ్దుల్‌ రవూఫ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

బొంరా్‌సపేట్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బొంరా్‌సపేట్‌ మండలంలో జరిగింది. ఎస్‌ఐ అబ్దుల్‌ రవూఫ్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని మైసమ్మగడ్డ తండాకు చెందిన వెంకటేశ్‌(22), సంతోష్‌ కలిసి బైక్‌పై శుక్రవారం హైదరాబాద్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌-బీజాపూర్‌ 163వ జాతీయ రహదారి సమీపంలోని మార్కెట్‌ చెక్‌పోస్టు వద్ద రంగయ్యవాడుక దగ్గర రాంగ్‌రూట్‌లో వస్తున్న డీసీఎం ఢీకొట్టింది. ఈ ఘటనలో వెంకటేశ్‌ తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందగా సంతోష్‌కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంతోష్‌ను చికిత్స నిమిత్తం పరిగి ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు కొడంగల్‌ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వెంకటేశ్‌ మృతితో తండాలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనపై మృతుడి రాములు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. సెలవుల నిమిత్తం తండాకు వచ్చిన వెంకటేశ్‌ స్నేహితుడితో కలిసి హైదరాబాద్‌కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

Updated Date - Jan 17 , 2025 | 11:31 PM