లారీ ఢీకొని యువకుడి మృతి
ABN , Publish Date - Jan 06 , 2025 | 12:32 AM
లారీ ఢీకొని యువకుడు మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విశ్రాంత ఉద్యోగి కోటేశ్వర్‌రావు కుమారుడు తనోజ్ (26) శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బైక్‌పై శంకర్‌పల్లికి పని నిమిత్తం బయలుదేరాడు.

శంకర్‌పల్లి, జనవరి 5(ఆంధ్రజ్యోతి): లారీ ఢీకొని యువకుడు మృతిచెందాడు. సంగారెడ్డి జిల్లా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ విశ్రాంత ఉద్యోగి కోటేశ్వర్‌రావు కుమారుడు తనోజ్ (26) శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో ఇంటినుంచి బైక్‌పై శంకర్‌పల్లికి పని నిమిత్తం బయలుదేరాడు. ఈక్రమంలో ఎదురుగా వస్తున్న లారీ బైక్‌ను శంకర్‌పల్లిలోని సంగారెడ్డి రోడ్డుపై ఢీకొంది. దాంతో తనోజ్‌కు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ శ్రీనివా్‌సగౌడ్ తెలిపారు.