భర్తను చంపిన భార్య
ABN , Publish Date - Jan 07 , 2025 | 11:36 PM
కుటుంబ కలహాలతో భర్తను భార్య చంపిన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్ రెడ్డి కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన అంకుల షణ్ముఖరావు(51), భార్య ఉమాపతితో కలిసి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ గ్రామంలో 6 నెలల నుంచి అద్దెకు ఉంటున్నాడు.

ఆదిభట్ల, జనవరి 7 (ఆంధ్రజ్యోతి)ః కుటుంబ కలహాలతో భర్తను భార్య చంపిన ఘటన ఆదిభట్ల పోలీ్‌సస్టేషన్ పరిధిలో మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. సీఐ రాఘవేందర్ రెడ్డి కథనం మేరకు.. శ్రీకాకుళం జిల్లా, కంచిలి మండలానికి చెందిన అంకుల షణ్ముఖరావు(51), భార్య ఉమాపతితో కలిసి తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని రాగన్నగూడ గ్రామంలో 6 నెలల నుంచి అద్దెకు ఉంటున్నాడు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే షణ్ముఖరావు మద్యానికి బానిసై పనికి వెళ్లకుండా నిత్యం భార్యను వేధించేవాడు. సోమవారం రాత్రి సైతం ఇద్దరు మద్యం సేవించి గొడవ పడ్డారు. మద్యం మైకంలో భర్తను భార్య విచక్షణారహితంగా కొట్టడంతో అతను అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటి యజమాని వచ్చి తలుపు కొట్టగా తలుపులు తీయలేదు. అనుమానం వచ్చి తలుపులను పగలకొట్టి చూడగా షణ్ముఖరావు గదిలో రక్తం మడుగులో పడి ఉన్నాడు. ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సీఐ రాఘవేందర్‌రెడ్డి, ఎస్సై రాజు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. ఇంట్లోనే ఉన్న భార్యను అందుపులోకి తీసుకున్నారు. మృతిదేహాన్ని పోస్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటి యజమాని శ్రీనాధ్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.