Share News

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ABN , Publish Date - Feb 07 , 2025 | 11:51 PM

ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు.

వాహనం ఢీకొని వ్యక్తి మృతి

ఘట్‌కేసర్‌ రూరల్‌, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకొని వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈఘటన పోచారం ఐటీ కారిడార్‌ పోలీ్‌సస్టేషన్‌లో చోటుచేసుకుంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పోచారం మున్సిపాలిటీ, వెంకటాపూర్‌కు చెందిన మేడబోయిన నవీన్‌ (38) సెంట్రింగ్‌ పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా శుక్రవారం రాత్రి నవీన్‌ తన బైక్‌పై వెంకటాద్రిటౌన్‌షి్‌పలోని ఎస్‌బీఐ ఏటీఎంలో డబ్బులు డ్రాచేసుకొని వస్తుండగా అనురాగ్‌ యూనివర్సిటీ సమీపంలోని పోచమ్మ ఆలయం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొంది. దీంతో నవీన్‌ తలకు బలమైన గాయమై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి కుటుంబసభ్యులకు సమాచారం అందించడంతో ఘట్‌కేసర్‌ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు నవీన్‌ మృతిచెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Updated Date - Feb 07 , 2025 | 11:51 PM