కష్టపడిన వారికి సముచిత స్థానం
ABN , Publish Date - Jan 04 , 2025 | 12:02 AM
పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

దోమ, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పిస్తామని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన మోత్కుర్ పీఎసీఎస్ చైర్మన్ ఆగిరాల యాదవరెడ్డి ప్రమాణస్వీకారం కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. పరిగి నియోజకవర్గంలో రూ.300 కోట్లు రుణమాఫీ అయినట్లు తెలిపారు. రైతులకు తిరిగి కొత్త రుణాలు అందించేందుకు బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయన్నారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు నీటిపారుదల శాఖ మంత్రి, ఆర్థిక మంత్రితో చర్చించగా వారు సానుకూలంగా స్పందించారని తెలిపారు. ప్రాజెక్టు నిర్మించి పరిగి నియోజకవర్గ ప్రజల చిరకాల కలను నెరవేరస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ శేఖరయ్య, డైరెక్టర్లు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటయ్య, భాస్కర్, మల్లేశ్, కిష్టమ్మ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డి ఆయూబ్, శంతకుమార్, ప్రభాకర్‌రెడ్డి, నర్సింహులు, నర్సింహారెడ్డి, లాల్‌కృష్ణ ప్రసాద్, సత్యనారాయణరెడ్డి, రాఘవేందర్‌రెడ్డి,యాదయ్యగౌడ్, అనంతయ్య పాల్గొన్నారు.
పీఆర్టీయూ క్యాలెండర్ ఆవిష్కరణ
దోమ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి చేతుల మీదుగా పీఆర్‌టీయూ నాయకులు నూతన సంవత్సరం క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో వెంకట్, పీఆర్‌టీయూ నాయకులు గోపాల్, లాల్యనాయక్, కృష్ణయ్య, చంద్రశేఖర్‌రెడ్డి, ప్రవీణ్‌సింగ్ పాల్గొన్నారు.
రోడ్ల విస్తరణకు రూ.471 కోట్లు
పరిగి: నియోజకవర్గంలో ఆర్ అండ్ బీ రోడ్ల విస్తరణకు రూ.471కోట్లు మంజూరైనట్లు పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి.రామ్మోహన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ అయ్యాయని తెలిపారు. పరిగి-వికారాబాద్ వయా నస్కల్‌రోడ్డు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.131కోట్లు, పరిగి-షాద్‌నగర్ వరకు నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి రూ.260కోట్లు మంజూరైనట్లు తెలిపారు. గడిసింగాపూర్ నుంచి రంగారెడ్డిపల్లి వరకు డబుల్‌రోడ్డు నిర్మాణానికి రూ.80కోట్ల నిధులు వచ్చాయని తెలిపారు. ఈ వారంలో టెండర్ల ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు.